తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదం.... కొండ దిగువభాగంలో మృతదేహాలు..?
- నీలగిరి ప్రాంతంలో హెలికాప్టర్ దుర్ఘటన
- హెలికాప్టర్ లో బిపిన్ రావత్ కుటుంబం
- ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన సహాయ బృందాలు
- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఇద్దరిని రక్షించిన సహాయక బృందాలు వారిని ఆసుపత్రికి తరలించాయి. కాగా, కొండ దిగువ భాగంలో పలువురి దేహాలు పడివున్నట్టు గుర్తించారు. వాటిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని భారత వాయుసేన తెలిపింది.