తెలంగాణలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మరింత తగ్గుతాయంటున్న అధికారులు!
- మెదక్ లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
- ఈశాన్య దిక్కు నుంచి వీస్తున్న చలి గాలులే కారణం
- రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం
ఇదే సమయంలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రేపు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న ఐదు వారాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వారు వెల్లడించారు.