తెలంగాణలో కొత్తగా 193 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 40,018 కరోనా పరీక్షలు
- గ్రేటర్ హైదరాబాదులో 73 కొత్త కేసులు
- ఒకరి మృతి
- ఇంకా 3,630 మందికి చికిత్స
అదే సమయంలో 153 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,187 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,564 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,630 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,993కి పెరిగింది.
