Botsa Satyanarayana: ఆ ఉత్తర్వుల వెనుక అచ్చెన్నాయుడు ఉండొచ్చు: బొత్స

Atchannaidu may be behind those orders says Botsa
షార్ట్స్‌లో చూడండి
పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ టీడీపీపై మండిపడ్డారు. పేదల కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చినా విమర్శిస్తున్నారని అన్నారు. గతంలో ఇళ్ల పట్టాల విషయంలో కూడా టీడీపీ ఇలాగే అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఈ పథకం ప్రభుత్వం సొంతంగా తీసుకొచ్చింది కాదని... పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగినందుకే తీసుకొచ్చామని తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు.
 
ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా టెక్కలి నియోజకవర్గంలోని ఓ పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులను విడుదల చేశారని... ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని సస్పెండ్ చేశామని బొత్స చెప్పారు. పంచాయతీ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వుల వెనుక టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఉండొచ్చని అన్నారు.
Go Back to Shorts
Botsa Satyanarayana
YSRCP
Telugudesam
Atchannaidu

More Telugu News