రెండో ఇన్నింగ్స్ ను 234/7 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా... న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్
- కాన్పూర్ లో టీమిండియా వర్సెస్ కివీస్
- రాణించిన అయ్యర్, సాహా
- ఆటకు రేపు ఆఖరిరోజు
- గెలుపుపై ధీమాతో ఉన్న టీమిండియా
భారత్ లో ఇప్పటివరకు ఏ విదేశీ జట్టు కూడా రెండో ఇన్నింగ్స్ లో 276 కంటే ఎక్కువ పరుగులు ఛేదించిన దాఖలాలు లేవు. ఆ ధీమాతోనే టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. తమ స్పిన్నర్లపై నమ్మకం ఉంచిన కెప్టెన్ రహానే... రెండో ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్, అశ్విన్ లకు కొత్తబంతిని అప్పగించాడు. తొలి ఇన్నింగ్స్ లో అక్షర్ 5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీయడం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లోనూ వీరిద్దరూ సత్తా చాటితే కివీస్ విలవిల్లాడడం ఖాయం. కాగా ఆటకు రేపు ఆఖరిరోజు.