ఒమిక్రాన్ ఎఫెక్ట్.. శంషాబాద్ విమానాశ్రయంలో ఆంక్షలు
Add ap7am to your home Screen

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. శంషాబాద్ విమానాశ్రయంలో ఆంక్షలు

Shamshabad airport concern on Omicron
  • 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి
  • విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక మరోమారు పరీక్షలు
  • ప్రయాణికులకు పరీక్షల కోసం మరో రెండు కేంద్రాలు
దక్షిణాఫ్రికాలో ప్రమాదకర కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ వెలుగుచూసిన నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికుల వద్ద 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు ఉండాల్సిందేనని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేసి అమలు చేస్తున్నారు. అలాగే, విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాజిటివ్‌గా తేలిన వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని కానీ, ఆసుపత్రిలో చేరాలని కానీ ఫోన్ చేసి చెబుతున్నారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్సువానా, ఇజ్రాయెల్, హాంకాంగ్, బెల్జియం తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో నెగటివ్ అని తేలితేనే విమానాశ్రయం నుంచి వెలుపలికి అనుమతిస్తారు. లేదంటే క్వారంటైన్‌కు తరలిస్తారు. ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు మరో రెండు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Omicron
South Africa
Hyderabad
Shamshabad Airport

More Telugu News