"సిరీ వదిలేస్తున్నావా"... బిగ్ బాస్ వేదికపై బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్
- రసవత్తరంగా బిగ్ బాస్-5 తెలుగు సీజన్
- స్టార్ మాలో ప్రసారం
- తాజాగా ప్రోమో రిలీజ్
- కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితుల సందడి
ప్రోమోలో మొదట యాంకర్ రవి తల్లిని చూపించారు. నువ్వు బిగ్ బాస్ ఇంటికే రాజా అంటూ ఆమె తనయుడ్ని ప్రోత్సహించడం ప్రోమోలో చూడొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా బిగ్ బాస్ వేదికపైకి వచ్చాడు. శ్రీహాన్ ను చూడగానే తీవ్ర భావోద్వేగాలకు లోనైన సిరి పెద్దగా ఏడ్చింది. చేతుల్లో ముఖం దాచుకుని విలపించింది. ఇంతలో శ్రీహాన్ మాట్లాడుతూ.... "సిరీ.. వదిలేస్తున్నావా?" అనడంతో సిరి ఇంకా ఎమోషన్స్ కు గురైంది. ఆ తర్వాత ఏంజరిగిందో తెలుసుకోవాలంటే నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే.