తెలంగాణలో మరో 147 కరోనా కేసులు నమోదు
Add ap7am to your home Screen

తెలంగాణలో మరో 147 కరోనా కేసులు నమోదు

Telangana corona details
  • గత 24 గంటల్లో 33,836 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 56 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,531 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,836 కరోనా పరీక్షలు నిర్వహించగా, 147 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 56 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 148 కరోనా నుంచి కోలుకున్నారు. ఒక మరణం సంభవించింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,148 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,67,631 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,531 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,986కి పెరిగింది.
Telangana
Corona Virus
Today Cases
Update

More Telugu News