ఏపీలో మరో 183 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 30,863 కరోనా పరీక్షలు
- గుంటూరు జిల్లాలో 30 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 2,194 మందికి చికిత్స
అదే సమయంలో 163 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,014 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,55,389 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,194 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,431కి పెరిగింది.