Pavan kalyan: 'భీమ్లా నాయక్' నుంచి వచ్చేస్తున్న టీజర్!

Bheemla Nayak movie update
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ .. రానా ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు సాగర్ కె చంద్ర 'భీమ్లా నాయక్' సినిమాను రూపొందించాడు. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రచార చిత్రాలు .. సింగిల్స్ ఆకట్టుకున్నాయి. వచ్చేనెల 14వ తేదీన గానీ .. 15వ తేదీన గాని టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పవన్ - రానా పాత్రలకి సంబంధించిన హైలైట్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేయనున్నట్టు చెబుతున్నారు. సినిమాపై ఆసక్తిని రేకేతించేదిలా ఈ టీజర్ ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాలో సముద్రఖని పాత్ర కీలకంగా నిలవనుంది. ఆ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందనే స్థాయిలో దానిని మలిచారట. మరో ముఖ్యమైన పాత్రలో మురళీశర్మ కనిపించనున్నాడు. ఈ ఏడాదిలో పవన్ నుంచి వచ్చిన 'వకీల్ సాబ్' వసూళ్ల పరంగా దూసుకుపోయింది. ఇక ఈ సినిమా ఏ స్థాయి సంచలనానికి తెరతీస్తుందో చూడాలి.
Go Back to Shorts
Pavan kalyan
Rana
Nihya Menon
Samyuktha Menon

More Telugu News