ఇండియా నుంచి ఆఫ్ఘనిస్థాన్ వెళ్లే వాహనాలకు అనుమతి ఇచ్చిన పాకిస్థాన్
- ఆకలితో అలమటిస్తున్న ఆఫ్ఘనిస్థాన్
- 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపేందుకు సిద్ధమైన ఇండియా
- భారత లారీలకు అనుమతి ఇచ్చిన పాక్
అయితే ఇవి ఆప్ఘనిస్థాన్ కు చేరాలంటే పాకిస్థాన్ గుండా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి వెళ్లే వాహనాలకు పాక్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మానవతా దృక్పథంతో అనుమతి ఇస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి 500 లారీలు ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది.