శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు.. ప్రవేశపెట్టిన బుగ్గన
- మూడు రాజధానుల చట్టాన్ని నిన్న ఉపసంహరించుకున్న ప్రభుత్వం
- పాలనా వికేంద్రీకరణ అవసరమన్న బుగ్గన
- లేకుంటే వేర్పాటువాద ముప్పు తప్పదన్న మంత్రి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వికేంద్రీకరణ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇప్పుడు కనుక ఈ నిర్ణయం తీసుకోకుంటే ఎప్పటికైనా వేర్పాటువాద ముప్పు తప్పదని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.