ఏపీలో కొత్తగా 164 మందికి కరోనా

AP Corona media bulletin
  • గత 24 గంటల్లో 25,197 కరోనా పరీక్షలు
  • కృష్ణా జిల్లాలో 32 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 2,392 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 25,197 కరోనా పరీక్షలు నిర్వహించగా, 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 32 కొత్త కేసులు వెల్లడి కాగా, విశాఖ జిల్లాలో 24, గుంటూరు జిల్లాలో 22 కేసులు గుర్తించారు. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 196 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,070 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,54,252 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,392 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,426కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Bulletin
Today Cases

More Telugu News