Ramya Krishna: చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో రమ్యకృష్ణ?

Ramya Krishna in Chiranjeevis God Father
షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటి రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశానికీ ఎస్ చెప్పేయకుండా.. ఆ పాత్రలో ఏదైనా విషయం ఉంటేనే ఆమె ఒప్పుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె మెగాస్టార్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, గతంలో చిరంజీవి సరసన పలు సినిమాలలో కథానాయికగా నటించిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆయనకు సోదరిగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. 'గాడ్ ఫాదర్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోకి వరుసకు సోదరి అయ్యే ఓ మహిళ పాత్ర చాలా కీలకమైనది. మలయాళం ఒరిజినల్ లో ఈ పాత్రను మంజువారియర్ చేసింది. ఈ తెలుగు వెర్షన్ కోసం నయనతార, శోభన.. వంట కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ తాజాగా రమ్యకృష్ణను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావచ్చు.

ఇదిలావుంచితే, ఈ 'గాడ్ ఫాదర్'లో మరో ముఖ్యమైన పాత్ర వుంది. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన ఆ పాత్రను ఇక్కడ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేయనున్నట్టు తెలుస్తోంది. పైగా వీరిద్దరిపై ఓ మాస్ సాంగ్ కూడా ఉందట. దీనికి సంగీత దర్శకుడు తమన్ అప్పుడే మాంచి ట్యూన్ కూడా సిద్ధం చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ పాత్ర లేకపోవడం విశేషం!  
Go Back to Shorts
Ramya Krishna
Chiranjeevi
Moahn Raja
Nayanatara
Shobhana

More Telugu News