తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 34,778 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 50 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 3,735 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,73,722 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,012 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,735 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,975కి పెరిగింది.
