జెస్సీని ఇంటి నుంచి బయటికి పంపించిన బిగ్ బాస్!
- వర్టిగో సమస్యతో బాధపడుతున్న జెస్సీ
- జెస్సీకి వైద్య చికిత్స అవసరమని గుర్తించిన బిగ్ బాస్
- జెస్సీ వెళుతుంటే కన్నీటిపర్యంతమైన షణ్ముఖ్, సిరి
- ప్రోమో విడుదల చేసిన స్టార్ మా
ఈ నేపథ్యంలో, మరింత మెరుగైన వైద్యసాయం కోసం జెస్సీని షో నుంచి బయటికి పంపించాలని బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయాన్ని బిగ్ బాస్ జెస్సీకి తెలియజేయగా, ఈ విషయాన్ని జెస్సీ ఇంటి సభ్యులతో పంచుకున్నాడు. ఈ హఠాత్ పరిణామాన్ని వారు ఊహించకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
జెస్సీతో మొదటి నుంచి ఎంతో సన్నిహితంగా ఉంటున్న షణ్ముఖ్, సిరి పరిస్థితి చెప్పనలవిగాదు. తీవ్ర భావోద్వేగాలతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు స్టార్ మా చానల్ విడుదల చేసిన ప్రోమోలో చూపించారు.