Team India: టీ20 వరల్డ్ కప్: టీమిండియా టార్గెట్ 133 రన్స్

Team India set to chase low target
షార్ట్స్‌లో చూడండి
నమీబియాతో మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు మెరుగ్గా రాణించారు. జడేజా, అశ్విన్, బుమ్రా ధాటికి నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. జడేజా 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, అశ్విన్ 20 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 2 వికెట్లు తీశాడు.

ఈ పోరులో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. నమీబియా ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్ (21), మైకేల్ వాన్ లింగెన్ (14) ఓ మోస్తరు ప్రదర్శన చేయగా, ఆల్ రౌండర్ డేవిడ్ వీజ్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో జాన్ ఫ్రైలింక్ (15 నాటౌట్), రూబెన్ ట్రంపుల్ మన్ (13) ఉపయుక్తమైన పరుగులు చేశారు.
Go Back to Shorts
Team India
Namibia
Super-12
Group-2
T20 World Cup

More Telugu News