తెలంగాణలో మరో 122 మందికి కరోనా
- గత 24 గంటల్లో 25,847 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 46 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 3,764 మందికి చికిత్స
అదే సమయంలో 171 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,489 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,759 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,764 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,966కి పెరిగింది.
