తెలంగాణలో కొత్తగా 151 కొవిడ్ కేసుల నమోదు
- గత 24 గంటల్లో 33,226 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 45 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 3,838 మందికి చికిత్స
అదే సమయంలో 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,203 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,402 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,838 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,963కి పెరిగింది.
