టీ20 వరల్డ్ కప్: శ్రీలంకతో మ్యాచ్... విజయమే లక్ష్యంగా బరిలోకి వెస్టిండీస్
- కొనసాగుతున్న సూపర్-12
- గ్రూప్-1లో వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక
- ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన లంక
- విండీస్ ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ ఆశలు సజీవం
గ్రూప్-1లో ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడిన వెస్టిండీస్ మిగతా రెండు మ్యాచ్ లలోనూ గెలిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే ఆ జట్టు నేటి మ్యాచ్ లో గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. లంకతో మ్యాచ్ కోసం ఆ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఇక శ్రీలంక జట్టులో లహిరు కుమార స్థానంలో బినుర ఫెర్నాండోను తీసుకున్నారు.