ఫాంహౌస్ కేసులో.. హీరో నాగశౌర్య తండ్రిని విచారణకు పిలిచిన పోలీసులు
- మంచిరేవులలో ఫాంహౌస్‌ను లీజుకు తీసుకున్న నాగశౌర్య తండ్రి రవీంద్ర
- అందులో గుత్తా సుమన్ అనే వ్యక్తి జూదం నిర్వహణ
- ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్ ను తీసుకురావాలని పోలీసుల ఆదేశాలు
ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్ కు సంబంధించిన పత్రాలను తీసుకురావాలని పోలీసులు ఆదేశించారు. దీంతో రవీంద్ర ప్రసాద్ ఈ రోజు పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. కాగా, ఓ ఫాంహౌస్‌ను గతంలో ఓ మాజీ ఉన్నతాధికారి నుంచి నాగశౌర్య తండ్రి రవీంద్ర ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అందులో గుత్తా సుమన్ అనే వ్యక్తి జూదం నిర్వహించడం కలకలం రేపింది. గుత్తా సుమన్‌పై ఏపీలో ఉన్న కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.