అక్టోబరు మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు ప్రకటించిన కేంద్రం

Center reveals October month GST collections
  • గత నెలలో రూ.1.30 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
  • రెండో అత్యధిక వసూళ్లు అని కేంద్రం వెల్లడి
  • ఈ ఏడాది ఏప్రిల్ లో రూ.1.41 లక్షల కోట్ల ఆదాయం
  • వరుసగా నాలుగో నెల లక్ష కోట్లు దాటిన జీఎస్టీ
గత నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. అక్టోబరులో జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.1,30,127 కోట్లు అని వివరించింది. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఇవి రెండో అత్యధిక వసూళ్లు అని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రూ.1.41 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్రం వివరించింది.

ఇక అక్టోబరు మాసానికి సంబంధించి కేంద్ర జీఎస్టీ రూ.23,861 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.30,421 కోట్లు అని తెలిపింది. సమీకృత జీఎస్టీ రూ.67,361 కోట్లు కాగా, సెస్ రూపేణా రూ.8,484 కోట్లు వసూలు అయినట్టు వివరించింది. కాగా, జీఎస్టీ లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా నాలుగో సారి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా పుంజుకుంటోందనడానికి ఇదే నిదర్శనం.
Go Back to Shorts
GST
October
Union Govt
India

More Telugu News