విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్... కాసేపట్లో భారీ బహిరంగ సభ
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- ఉద్యమించిన కార్మిక సంఘాలు
- మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్
- నేడు సభాముఖంగా ప్రకటించనున్న వైనం
పవన్ తన పర్యటనలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించనున్నారు. కార్మికులకు తన సంఘీభావాన్ని ప్రకటించనున్నారు. బీజేపీతో ఏపీలో జనసేన భాగస్వామ్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో... కేంద్రం తీసుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై పవన్ పోరాటం ఆసక్తి కలిగిస్తోంది.