ఏపీలో కొత్తగా 481 మందికి కరోనా నిర్ధారణ
- గత 24 గంటల్లో 39,604 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 157 కొత్త కేసులు
- అనంతపురం జిల్లాలో ఆరుగురికి పాజిటివ్
- రాష్ట్రంలో ఒకరి మృతి
- యాక్టివ్ కేసుల సంఖ్య 4,837
అదే సమయంలో 385 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,65,716 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,46,512 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,837 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,367కి పెరిగింది.