Raja Singh: అబద్ధాలు తప్ప నిజాలు చెప్పవా?: కేటీఆర్ పై రాజాసింగ్ ఫైర్

KTR always lies says Raja Singh
షార్ట్స్‌లో చూడండి
మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాలు తప్ప నీవెప్పుడూ నిజాలు చెప్పవా? అని ప్రశ్నించారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేసీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు.

పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాల్లో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని అడిగారు. పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం రూ. 41 తీసుకుంటున్నది నిజం కాదా? అని అడిగారు. తెలంగాణ ప్రజలపై మీకు అంత ప్రేమ ఉంటే ఆ రూ. 41లను వదిలేసుకోవాలని అన్నారు. కేటీఆర్ కు గంట తిరిగితే బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పారు. ట్విట్టర్ లోనే భోజనం చేసి అందులేనే పడుకునే కేటీఆర్ కు తన ట్వీట్ కి సమాధానం చెప్పడానికి ఆరు రోజులు పట్టిందని అన్నారు.
Go Back to Shorts
Raja Singh
BJP
KTR
TRS

More Telugu News