ఏపీలో గత 24 గంటల్లో 483 కరోనా పాజిటివ్ కేసులు

AP Covid Details
  • గత 24 గంటల్లో 40,191 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 120 కొత్త కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 5,654 మందికి చికిత్స
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,191 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 483 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 120 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 81, గుంటూరు జిల్లాలో 61, ప్రకాశం జిల్లాలో 55, పశ్చిమ గోదావరి జిల్లాలో 53 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం, కడప, అనంతపురం జిల్లాలలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.

అదే సమయంలో 534 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,287 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,41,316 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,654 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,317కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
COVID19
Media Report
Details

More Telugu News