విజయవాడ మార్గంలో 4 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

traffic jam on Hyderabad vijayawada high way amid dasara fistival
  • సొంతూళ్లకు వెళ్తున్న వారితో కిక్కిరిసిన రహదారి
  • నాలుగు కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు గంటకుపైగా సమయం
  • తీవ్ర ఇక్కట్లు పడుతున్న వాహనదారులు
దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న వారి వాహనాలతో హైదరాబాద్-విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది. నిన్న సాయంత్రం ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిక్కుకుపోయిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సాధారణ సమయాల్లో ఈ దూరాన్ని దాటేందుకు నాలుగు నిమిషాల సమయం పడుతుంది. అలాంటిది నిన్న దాదాపు గంట సమయం పట్టింది. దీంతో వాహనాల్లోని చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. 
Go Back to Shorts
Hyderabad
Vijayawada
High Way
Dasara
Festival

More Telugu News