ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదు: సజ్జల
- ఉద్యోగ సంఘాలతో చర్చలు
- మీడియాతో మాట్లాడిన సజ్జల
- ఉద్యోగులు ఎప్పుడూ సీఎం జట్టులో సభ్యులేనని వెల్లడి
- జీతాలు ఆలస్యం కావడం వాస్తవమేనని అంగీకారం
జీతాలు ఆలస్యం అవడం ఇబ్బందికరమేనని, అయితే సీఎం జగన్ ఉద్యోగుల భద్రత విషయంలో ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఎప్పుడూ అలసత్వం వహించలేదని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు అడగకముందే ప్రభుత్వం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని సజ్జల ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ నెలాఖరుకు పీఆర్సీ సమస్య పరిష్కారం అవుతుందని, నవంబరు చివరినాటికి ఉద్యోగుల ఇతర సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని వివరించారు. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదని, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత ఉద్యోగులపైనే ఉందని అన్నారు. జగన్ సీఎం బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంలో ఉద్యోగులకు ప్రాధాన్యత పెరిగిందని పేర్కొన్నారు.