టీమిండియా జెర్సీ మారింది!

New jersey for Team India players for upcoming worldcup
  • భారత ఆటగాళ్లకు కొత్త జెర్సీలు
  • బ్లూ కలర్ లోనే సరికొత్త డిజైన్
  • అభిమానుల ఆకాంక్షలే స్ఫూర్తి అంటూ బీసీసీఐ వెల్లడి
  • ఈ నెల 17 నుంచి టీ20 వరల్డ్ కప్
టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్ లోనే కొత్త డిజైన్ తో జెర్సీలను రూపొందించారు. అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపాలు పేరిట ఈ జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ పేర్కొంది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది.

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ లో పాల్గొంటున్నారు. ఈ నెల 15తో ఐపీఎల్ ముగియనుంది. ఆ తర్వాత రెండ్రోజులకే, అంటే, ఈ నెల 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ గడ్డపైనే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. కొత్త జెర్సీలతో టీమిండియా దూసుకుపోవాలని అభిమానులు సందేశాలు పంపుతున్నారు.
Go Back to Shorts
Jersey
Team India
Players
T20 World Cup

More Telugu News