అమరావతి నుంచి తిరుమల వరకు జేఏసీ మహా పాదయాత్ర
- తుళ్లూరులో అమరావతి జేఏసీ విస్తృత స్థాయి సమావేశం
- 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట మహా పాదయాత్ర
- నవంబరు 1న ప్రారంభం
- డిసెంబరు 17న ముగియనున్న పాదయాత్ర
ఈ పాదయాత్రలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని జేఏసీ నేతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తీవ్ర నిర్ణయాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఈ మహా పాదయాత్ర డిసెంబరు 17న ముగుస్తుందని అన్నారు.