అమెరికాలో ఇళ్ల మీద కూలిన విమానం.. ఇద్ద‌రి మృతి.. వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో ఇళ్ల మీద కూలిన విమానం.. ఇద్ద‌రి మృతి.. వీడియో ఇదిగో

Plane crash in usa
  • కాలిఫోర్నియాలో ప్ర‌మాదం
  • పలు వాహనాలు దగ్ధం
  • కాలిపోయిన విమానం  
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విమానం ఇళ్ల మీద కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లతో పాటు, అక్క‌డి డెలివరీ ట్రక్ స‌హా పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఆరు సీట్లు ఉండే చిన్న‌ ఎయిర్‌క్రాఫ్ట్ ఒక‌టి అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరి, గంట తర్వాత కాలిఫోర్నియా చేరుకుంది. అదే స‌మ‌యంలో ఒక్క‌సారిగా  ఇళ్ల మీద కూప్ప‌కూలింది.  

ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోయింద‌ని అక్క‌డి అధికారులు చెప్పారు. ఈ ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న‌ అగ్నిమాపక సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్ర‌మాదం ఎందుకు జ‌రిగింద‌న్న విషయంపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
plane
USA

More Telugu News