ఆఫ్ఘనిస్థాన్ లోని హోటళ్లలో ఉగ్రదాడులు జరిగే అవకాశం: అమెరికా, బ్రిటన్ హెచ్చరిక
- ఖాళీ చేయాలని తమ పౌరులకు అమెరికా, బ్రిటన్ సూచన
- ముఖ్యంగా సెరెనా హోటల్‌లో దాడి జరిగే ఛాన్స్
- ఆ ప్రాంత పరిసరాల్లోనూ ఉండకూడదు
ముఖ్యంగా హోటళ్లలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని, హోటళ్లకు దూరంగా ఉండాలని తెలిపాయి. సెరెనా హోటల్‌లో, దానికి దగ్గర్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లాలని అమెరికా అధికారులు ఓ ప్రకటన చేశారు. దాడులు పెరిగాయని హోటళ్లలో ఉండకూడదని, ముఖ్యంగా కాబూల్‌లోని సెరెనా హోటల్‌ను ఖాళీ చేయాలని బ్రిటన్ ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది. కాగా, ఆ విలాసవంతమైన హోటల్‌లో తాలిబన్లు గతంలో రెండుసార్లు దాడులు జరిపారు.