ఈటల సమక్షంలో బీజేపీలోకి భారీ చేరికలు
- హుజూరాబాద్ లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం
- ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్న పార్టీలు
- బీజేపీలో చేరిన వీణవంక మండలం నర్సింహపల్లి గ్రామస్తులు
ఇదే సమయంలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను ఆకర్షించే ప్రయత్నాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఈటల అనుచరులు, బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు ఈటల కూడా క్షేత్ర స్థాయిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలోని వీణవంక మండలం నర్సింహపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. వీరందరికీ కాషాయ కండువా కప్పి ఈటల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.