రైల్వే ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటన

Centre announces bonus to Railway employees
  • 78 రోజుల శాలరీకి సమానమైన బోనస్
  • ఖజానా మీద రూ. 1,984.73 కోట్ల భారం
  • 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల శాలరీకి సమానమైన బోనస్ ను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఖజానా మీద రూ. 1,984.73 కోట్ల ఆర్థిక భారం పడనుంది.

 ఈ నిర్ణయంతో మొత్తం 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మేలు జరగనుంది. అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ ఈ ఆర్థిక సంవత్సరానికి 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు ఈ బోనస్ ను చెల్లిస్తారు. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇస్తారు. కానీ ఈసారి 78 రోజుల బోనస్ ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
Go Back to Shorts
Indian Railways
Employees
Bonus

More Telugu News