'కొండ పొలం'పై పెరిగిన అంచనాలు!
- గిరిజనుల జీవితాల నేపథ్యంలో సాగే కథ
- సంగీత దర్శకుడిగా కీరవాణి
- సందర్భానుసారం వచ్చే 7 పాటలు
- అక్టోబర్ 8వ తేదీన సినిమా విడుదల
అయితే ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలోని 7 పాటలు కూడా జనంలోకి దూసుకుపోయాయి. కీరవాణి .. సిరివెన్నెల .. చంద్రబోస్ రాసిన పాటలు జనం మనసులకు పట్టేశాయి.
ముఖ్యంగా 'ఓబులమ్మా' .. 'శ్వాసలో' .. 'చెట్టెక్కి' పాటలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. యామిని ఘంటసాల .. రోహిత్ .. శ్రేయ ఘోషల్ .. కాలభైరవ పాడిన పాటలకి మంచి మార్కులు పడ్డాయి. ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో 7 పాటలు ఉండటం .. అవన్నీ కూడా కూడా ఆదరణ పొందడం విశేషంగానే చెప్పుకోవాలి.