మమతా బెనర్జీ గెలిచారు కదా, మరి మోదీ రాజీనామా చేస్తారా?: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
- సవాల్ విసరడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది
- హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవడం ఖాయం
పశ్చిమబెంగాల్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలిచారని... ఆ ఎన్నికను కూడా బీజేపీ సవాల్ గా తీసుకుందని... మరి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలవడం ఖాయమని చెప్పారు.