Bandi Sanjay: చార్మినార్ కు వెళ్లి భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న బండి సంజ‌య్‌

bandi sanjay visits bhagya lakshmi temple
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఈ రోజు హైద‌రాబాద్‌లోని చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యానికి వచ్చారు. అమ్మ‌వారికి ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు బీజేపీ నేత‌లు కూడా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయ‌న తెలంగాణ‌లో పాద‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. బీజేపీని తెలంగాణ‌లో అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న పాద‌యాత్ర చేప‌ట్టారు.

నిన్న హుస్నాబాద్‌లో ఆయ‌న తొలి ద‌శ పాద‌యాత్ర ముగిసింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యానికి చేరుకుని అమ్మ‌వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే, ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్‌లో నేటి నుంచే ఆయ‌న ప్ర‌చారం ప్రారంభించ‌నున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
Hyderabad

More Telugu News