సెన్సార్ పూర్తిచేసుకున్న'కొండ పొలం'
- గిరిజనుల సమస్యలే ప్రధాన ఇతివృత్తం
- ప్రకృతి సాక్షిగా నడిచే ప్రేమకథాంశం
- సెన్సార్ నుంచి 'యు' సర్టిఫికెట్
- అక్టోబర్ 8వ తేదీన విడుదల
అడవిలోని గిరిజనులు తమ మనుగడ సాగించడానికి ఒక వైపున క్రూర మృగాలతోనే కాదు, అంతకంటే క్రూరంగా ఆలోచించే కొంతమంది మనుషులతో కూడా పోరాటం చేయవలసి వస్తుందనే విషయాన్ని, ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ కి విశేషమైన స్పందన వస్తోంది.
సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, 'యు' సర్టిఫికెట్ తెచ్చుకుంది. రకుల్ ఈ సినిమాలో గిరిజన యువతిగా నటించడం .. సింపుల్ మేకప్ తో కనిపించనుండటం విశేషం. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, అక్టోబర్ 8వ తేదీన విడుదల చేస్తున్నారు.
.