Narendra Modi: కేంద్రమంత్రి డ్యాన్స్ టాలెంట్ కు ముగ్ధుడైన ప్రధాని మోదీ

  • అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
  • స్థానికులతో కలిసి ఆటాపాటా
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో
  • రిజిజు డ్యాన్స్ వీడియో చూసిన మోదీ
PM Modi appreciates union law minister Kiren Rijiju

సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన జానపద నృత్యం తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీక్షించారు. ఆపై స్పందించకుండా ఉండలేకపోయారు. మన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ మంచి డ్యాన్సర్ కూడా అంటూ కితాబునిచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర తేజోమయ, వర్ణభరిత సంస్కృతిని వీక్షించడం బాగుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ రిజిజు డ్యాన్స్ వీడియోను కూడా మోదీ ట్విట్టర్ లో పంచుకున్నారు.

More Telugu News