పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ కు గుండెపోటు
- గత మూడు రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడిన ఇంజమామ్
- యాంజియోప్లాస్టీ నిర్వహించిన లాహోర్ ఆసుపత్రి వైద్యులు
- వన్డేల్లో 11,701 పరుగులు చేసిన ఇంజమామ్
ఇంజమామ్ ప్రస్తుత వయసు 51 సంవత్సరాలు. పాకిస్థాన్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత ఇంజమామ్ పేరిటే ఉంది. 375 వన్డేలు ఆడిన ఇంజమామ్ మొత్తం 11,701 పరుగులు చేశారు. 119 టెస్టులు ఆడిన ఆయన 8,829 రన్స్ చేశారు. అత్యంత విజయవంతమైన పాకిస్థాన్ కెప్టెన్లలో ఒకరిగా కూడా ఆయన గుర్తింపు పొందారు.
2007లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ కు పలు స్థానాల్లో ఆయన సేవలు అందించారు. బ్యాటింగ్ కన్సల్టెంట్ గా పని చేశారు. 2016-19 మధ్య కాలంలో పాక్ జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా ఉన్నారు. అంతేకాదు ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్ గా కూడా సేవలందించారు. ఇంజమామ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.