ఏపీలో గత 24 గంటల్లో 618 కరోనా కేసులు, 6 మరణాలు
- ఒక్కరోజులో 38,069 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 122 కొత్త కేసులు
- విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు
- ఇంకా 12,482 మందికి చికిత్స
అదే సమయంలో 1,178 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,47,459 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,20,835 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,482 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,142కి పెరిగింది.