Tremors: అంగారక గ్రహంపై భారీ ప్రకంపనలు... రికార్డు చేసిన నాసా ఇన్ సైట్ ల్యాండర్

Huge tremors on Martian surface
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారక గ్రహంపై చాన్నాళ్లుగా పరిశోధనలు సాగిస్తోంది. ఈ క్రమంలో నాసాకు చెందిన ఇన్ సైట్ ల్యాండర్ ఆసక్తికర అంశాన్ని భూమికి చేరవేసింది. అంగారక గ్రహం ఉపరితలంపై వచ్చిన భారీ ప్రకంపనలను ఇన్ సైట్ ల్యాండర్ నమోదు చేసింది. వీటి తీవ్రతను 4.2గా గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో అంగారకుడి ఉపరితలంపై మూడు పర్యాయాలు ప్రకంపనలు వచ్చినట్టు వెల్లడైంది.

భూమి ఉపరితలం కంటే అంగారకుడి ఉపరితలం చాలా పలుచన అని నాసా భావిస్తోంది. అందుకే అంగారకుడిపై ఏర్పడుతున్న ప్రకంపనలు అత్యధిక సమయం పాటు కొనసాగుతున్నాయని పేర్కొంది. సెప్టెంబరు 18న సంభవించిన ప్రకంపనలు దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగినట్టు తెలిపింది. ఇప్పటివరకు అంగారకుడిపై వచ్చిన 700 ప్రకంపనలను ఇన్ సైట్ ల్యాండర్ నమోదు చేసింది.
Go Back to Shorts
Tremors
Mars
Insight Lander
NASA

More Telugu News