తెలంగాణలో మరో 239 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 4,778 మందికి చికిత్స
అదే సమయంలో 336 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,55,961 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,778 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,911కి పెరిగింది.
