Anthem: టీ20 వరల్డ్ కప్ అధికారిక గీతం ఇదిగో!

  • అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్
  • యూఏఈ వేదికగా మెగా టోర్నీ
  • అధికారిక గీతం రూపొందించిన ఐసీసీ
  • స్వరాలు అందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది
ICC releases world cup official anthem

వచ్చే నెలలో ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులకు వినోదం అందించేందుకు టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరిగే ఈ ఐసీసీ మెగా ఈవెంట్ అక్టోబరు 17 నుంచి షురూ కానుంది. ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది. కాగా, ఈ టీ20 వరల్డ్ కప్ కోసం అధికారిక గీతాన్ని విడుదల చేశారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది బాణీలు అందించిన ఈ గీతం క్రికెట్ అభిమానులను మరింత హుషారెత్తించేలా క్రికెట్ దిగ్గజాల యానిమేషన్ క్యారెక్టర్స్ తో సాగుతుంది.

More Telugu News