Chandrababu: టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి డూండీ రాకేశ్ ను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

Chandrababu talks to Dundi Rakesh
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా, టీడీపీ శ్రేణులు వారిని నిలువరించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి డూండీ రాకేశ్ గాయపడి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాకేశ్ ను నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ ద్వారా పరామర్శించారు. అతనికి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాకేశ్ కు హామీ ఇచ్చారు. చంద్రబాబు నివాసం వద్ద జరిగిన రాళ్ల దాడిలో డూండీ రాకేశ్ కు కూడా బలమైన దెబ్బలు తగిలాయి. ఈ దాడిలో మంగళగిరి టీడీపీ నేత జంగాల సాంబశివరావు, ఓ టీవీ చానల్ కెమెరామన్ కూడా గాయపడ్డారు.
Go Back to Shorts
Chandrababu
Dundi Rakesh
Treatment
Injuries
TDP

More Telugu News