Bandi Sanjay: తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన‌ బండి సంజ‌య్

bandi sanjay slams trs
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల స‌మ‌స్య‌లు, నిరుద్యోగ భృతి అంశాల‌ను ఆయ‌న లేవ‌నెత్తారు. ఉద్యోగాల‌ ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుద‌ల చేయాల‌ని ఆయ‌న అన్నారు.  

ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ బృతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల ముందు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ ప్రచారం చేసుకున్నార‌ని, ఎన్నిక‌ల త‌ర్వాత మాత్రం తన కుటుంబం, వారి బంధువులకు మాత్ర‌మే ఉద్యోగాలు ఇచ్చుకున్నార‌ని ఆయ‌న అన్నారు.  

నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌లేద‌ని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగికి రూ.లక్ష బకాయి ఇవ్వాల్సి ఉంద‌ని చెప్పారు. వాటిని వెంట‌నే ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయ‌న కోరారు. 
Go Back to Shorts
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News