Sri Lanka: భారత్ సమీపంలోని మూడు దీవులను చైనాకు అప్పగించేసిన శ్రీలంక

Sri Lanka Handed Over Its Three Islands To China
  • పవన్ విద్యుదుత్పత్తి కోసమేనన్న ఆ దేశ ఎంపీ
  • శ్రీలంక తమిళుల నుంచి వ్యతిరేకత
  • తమిళ సీఎం స్టాలిన్‌పై ప్రశంస
భారతదేశానికి సమీపంలో ఉన్న మూడు దీవులను చైనాకు శ్రీలంక అప్పగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్రీలంక చేసిన ఈ పనివల్ల భారతదేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శ్రీలంక తమిళులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన విద్యుదుత్పత్తి కోసం తమ దేశానికి చెందిన మూడు దీవులను చైనాకు అప్పగించిన విషయాన్ని ఆ దేశ ఎంపీ రాధాకృష్ణన్ తెలిపారు. అయితే, ప్రభుత్వ తీరును శ్రీలంక తమిళులు వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. శ్రీలంక మలైయగ మక్కల్ మున్నణి అధ్యక్షుడు కూడా అయిన రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుచ్చిని సందర్శించారు.

ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిద్దీన్ నివాసంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని శ్రీలంక శరణార్థుల శిబిరాలను పునరావాసాలుగా మార్చడంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆయన అభినందించారు. శ్రీలంకలో తమిళులు నివసించే ప్రాంతంలో భారత్ 50 వేల ఇళ్లు నిర్మించిందని తెలిపారు. అంతేకాక, ఓ రైలు మార్గాన్ని, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. చైనా తమ దేశంలో 500 హెక్టార్లలో పోర్టును ఏర్పాటు చేస్తోందని, దాదాపు 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయని రాధాకృష్ణన్ వివరించారు.
Sri Lanka
Island
China
India

More Telugu News