పండగకి సై అంటున్న విశాల్ 'ఎనిమీ'!
- విశాల్ - ఆర్య కాంబినేషన్లో 'ఎనిమీ'
- దసరా పండుగకి భారీ రిలీజ్
- కథానాయికగా మృణాళిని రవి
- కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్
ఇద్దరు స్నేహితులు .. బద్ధశత్రువులుగా ఎందుకు మారవలసి వచ్చింది? శత్రువులుగా వాళ్లు ఎలా తలపడ్డారు? చివరికి పాత స్నేహం నిలుస్తుందా? కొత్త శత్రుత్వం గెలుస్తుందా? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరగనుంది. 'వాడు - వీడు' తరువాత విశాల్ .. ఆర్య కలిసి నటించిన సినిమా ఇది.
మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. విశాల్ జోడిగా 'మృణాళిని రవి' అలరించనుంది. 'గద్దలకొండ గణేశ్' సినిమా ద్వారా ఈ అమ్మాయి ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రకాశ్ రాజ్ .. మమతా మోహన్ దాస్ కీలకమైన పాత్రలను పోషించారు.