Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. వర్షాలు కురవాలంటూ బాలికలను నగ్నంగా ఊరేగించిన వైనం!

  • వర్షాలు కురవక గ్రామంలో కరవు పరిస్థితులు
  • వరుణుడి కటాక్షం కోసం ఆరుగురు బాలికలను నగ్నంగా తిప్పిన వైనం
  • వారి వెనక భజనలు చేస్తూ గ్రామస్థులు
  • సీరియస్ అయిన బాలల హక్కుల పరిరక్షణ మండలి
Minor girls stripped naked in Madhya Pradesh village for rains

మధ్యప్రదేశ్‌లో అత్యంత దారుణ ఘటన జరిగింది. వర్షాల కోసం వరుణ దేవుడి కటాక్షాన్ని కోరుతూ బాలికలను వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. దామే జిల్లాలోని బనియా గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్షాలు ముఖం చాటేయడంతో గ్రామంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో వరుణ దేవుడి కరుణా కటాక్షాల కోసం గ్రామంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. అందులో భాగంగానే బాలికలను నగ్నంగా ఊరేగించారు.

తొలుత ఓ కప్పను పట్టుకుని దానిని కర్రకు కట్టిన గ్రామస్థులు ఆ కర్రను నగ్నంగా ఉన్న బాలిక భుజాలపై పెట్టి వీధుల్లో తిప్పుతూ భజనలు చేశారు. మొత్తంగా ఆరుగురు బాలికలను ఇలా నగ్నంగా తిప్పినట్టు ఉన్న వీడియోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో బాలల హక్కుల పరిరక్షణ మండలి (ఎన్‌సీపీసీఆర్) దృష్టిలో పడడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

More Telugu News