జగన్ పాలనపై బీజేపీ నేతలు కావాలనే మతం ముద్ర వేస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి
- వినాయకచవితి జరుపుకోవద్దని ఎవరికైనా ఎవరైనా చెప్పారా?
- సోము వీర్రాజు మాటలు రాజకీయ డ్రామాల్లో భాగమే
- బీజేపీ నేతలవి మత రాజకీయాలు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కర్నూలులో సోము వీర్రాజు మాట్లాడిన మాటలు రాజకీయ డ్రామాల్లో భాగమేనని అన్నారు. రాష్ట్రంలో ఎవరినైనా వినాయకచవితి వేడుకలు జరుపుకోవద్దని ఎవరైనా చెప్పారా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పండుగలు జరుపుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
బీజేపీ నేతలవి మత రాజకీయాలని... కావాలనే జగన్ పాలనపై మతం ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి సమానంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగన్ దని అన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ వినాయకచవితిని సురక్షితంగా జరుపుకోవాలని చెప్పారు.